గిరిపురంలో వి బి జి రాంజీ పథకంపై అవగాహన సదస్సు

3చూసినవారు
గిరిపురంలో వి బి జి రాంజీ పథకంపై అవగాహన సదస్సు
మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బాదావత్ నీలా సైదులు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వి. బి. జి. రాంజీ పథకం కింద గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చించారు. గ్రామంలో ఏయే పనులు చేపట్టాలో, వాటి ప్రాధాన్యతపై గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్ సభ్యులకు వివరించారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అవసరమైన రహదారులు, నీటి కుంటలు, ఇంకుడు గుంతలు తదితర పనులను ప్రతిపాదించాలని కోరారు. ఈ గ్రామ సభలో వార్డు సభ్యులు నవీన్, పంచాయతీ కార్యదర్శి విజిత, గ్రామ యువకులు, మహిళలు, ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్