పంట, రైతుల వివరాలను నమోదు చేయాలి: వ్యవసాయ అధికారి

10చూసినవారు
పంట, రైతుల వివరాలను నమోదు చేయాలి: వ్యవసాయ అధికారి
మహబుబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల శనివారం బయ్యారం మండలం కొత్తపేటలో వరి సాగు క్షేత్రాలను పరిశీలించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంట, తమ వివరాలను యాప్ లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. దీనివల్ల పంటల క్రయవిక్రయాలు సులభతరం అవుతాయని ఆమె పేర్కొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజు, ఏఈవోలు నాగరాజు, అఖిల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్