దంతాలపల్లి: 10 సర్పంచ్, 2వార్డ్ మెంబర్ నామినేషన్లు

6చూసినవారు
దంతాలపల్లి: 10 సర్పంచ్, 2వార్డ్ మెంబర్ నామినేషన్లు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మండలంలోని 10 సర్పంచి, 2 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు వెల్లడించారు. రామవరం పంచాయతీకి అత్యధికంగా 5 సర్పంచి నామినేషన్లు రాగా, బొడ్లాడ, గున్నేపల్లి, నిదానపురం, దంతాలపల్లి, బీర్శెట్టిగూడెం పంచాయతీలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్