మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి నేత అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు టీడీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు కొండపల్లి రాం చందర్ రావు తెలిపారు. ఈ సంఘటన రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది.