హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరుగుతున్న కల్చరల్ మీట్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచందర్ నాయక్, 'దేవత' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మ' పాటకు శోభన్ బాబు గెటప్‌లో డాన్స్ చేసి అందరినీ అలరించారు. రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్మెల్యే ఇలా డాన్స్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.