డోర్నకల్: చేపల చెరువులో విషప్రయోగం 3 క్వింటాళ్ల చేపలు మృతి

1చూసినవారు
డోర్నకల్: చేపల చెరువులో విషప్రయోగం 3 క్వింటాళ్ల చేపలు మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పేరుమాండ్ల సంకీస గ్రామ శివారులోని రెడ్డి చేపల చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారు. ఈ ఘటనలో సుమారు 3 క్వింటాళ్ల చేపలు మృత్యువాత పడ్డాయి. దీనివల్ల దాదాపు రూ. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్