మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని 11 కెవి సబ్ స్టేషన్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని లైన్ మెన్ సోమేశ్వర్ తెలిపారు. రెండవ శనివారం సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న చెట్ల కొమ్మలు తొలగించే పనులు కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.