డోర్నకల్: ఒకే మందార చెట్టుకు రెండు రంగుల పువ్వులు

67చూసినవారు
డోర్నకల్: ఒకే మందార చెట్టుకు రెండు రంగుల పువ్వులు
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని సోమయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉన్న మందార చెట్టుకు సోమవారం రెండు రంగుల పువ్వులు పూశాయి. సోమయ్య తన ఇంట్లో పలు రకాల పూల చెట్లను పెంచుతున్నారు. సోమవారం ఉదయం తెల్ల మందారం చెట్టుకు గులాబీ రంగు కూడా పూసింది. విషయం తెలుసుకున్న స్థానికులు పువ్వులను చూడటానికి ఆసక్తిగా వస్తున్నారు. తెల్ల మందార చెట్టుకు గులాబీ రంగు పువ్వులు పూయడం ఆశ్చర్యంగా ఉందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్