పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు

458చూసినవారు
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు
ఆత్మకూరు మండలం అగ్రంపాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి శనివారం తన కుటుంబసమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువత నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్