గార్ల: గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టు

2577చూసినవారు
గార్ల: గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్టు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలోని కొండాలమ్మ దేవాలయంలో గురువారం రాత్రి అక్రమ తవ్వకాలు జరుపుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుండి వచ్చి దేవాలయంలో తవ్వకాలు చేస్తుండగా గ్రామస్తులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్