గార్ల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో గాయాలు

64చూసినవారు
గార్ల: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో గాయాలు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సేరిపురం నుండి పోమ్యతండా వెళ్ళే రహదారి పై బుధవారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో సేరిపురానికి చెందిన లావుడ్యా కవితకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.