మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకటాపురం గ్రామంలో యువకులు హెల్మెట్ ధరించడంపై వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామ సరిహద్దులో ప్లెక్సీ ఏర్పాటు చేసి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ ప్రచారం వాహనదారులను ఆకట్టుకోవడంతో, వారు హెల్మెట్ ధరిస్తున్నామని తెలిపారు.