షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో వస్తువులు దగ్ధం

3చూసినవారు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రెడ్యాతండాలో గురువారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు, ఇంటి యజమాని మోహన్ కుటుంబం ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఫ్రిజ్, కూలర్, కంప్యూటర్, వంట పాత్రలు, బట్టలు, మంచాలు వంటి వస్తువులు కాలిపోయాయి. బాధితుడు మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్