ఖమ్మం-కురవి వెళ్లే జాతీయ రహదారి 365ఏను 100 అడుగుల రెండు వరుసల రోడ్డుగా విస్తరించేందుకు అధికారులు డోర్నకల్ మండలం రావిగూడెం గ్రామం వద్ద భూమి స్థాయిని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న 33 అడుగుల రోడ్డును 100 అడుగులకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు.