కురవి: గేదెలు అడ్డురావడంతో ఆటో బోల్తా

3చూసినవారు
కురవి: గేదెలు అడ్డురావడంతో ఆటో బోల్తా
మంగళవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సోమ్లాతండా వద్ద జయ్యారం నుంచి మహబూబాబాద్‌కు వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డుపై గేదెలు అడ్డురావడంతో తప్పించబోయే క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో జయ్యారం గ్రామానికి చెందిన డ్రైవర్ కన్నీబోయిన కృష్ణకు కుడిచేయి విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్