మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్ట వద్ద రేపు బుధవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా కందికొండ జాతర ఘనంగా జరుగనుంది. కందగిరి శిఖరాగ్రంపై వెలసిన శ్రీలక్ష్మి నరసింహస్వామిని, మార్గమధ్యంలో కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు తెల్లవారుజాము నుంచే తరలిరానున్నారు.