కురవి: పశువులను బైక్ తో ఢీకొట్టి వ్యక్తి మృతి

78చూసినవారు
కురవి: పశువులను బైక్ తో ఢీకొట్టి వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా కురవి సమీపంలో ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపుతప్పి సుదనాపల్లికి చెందిన సంపత్ (40) అనే వ్యక్తి పశువులను ఢీకొట్టారు. బైక్ వేగంగా ఉండడం వల్ల తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి పూట కావడం వల్ల సరిగ్గా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్