కురవి: మంచినీటి బావిలో విష ప్రయోగం

2013చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగులో మంచినీటి బావిలో విషం కలపడంతో అందులోని చేపలు మృతి చెందాయి. బావిలో విషం కలిపిన విషయాన్ని గుర్తించిన గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానికులను అప్రమత్తం చేసి, బావిలోని నీటిని మోటర్ల ద్వారా ఖాళీ చేయించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పింది.
Job Suitcase

Jobs near you