కురవి: వైభవోపేతంగా కొనసాగిన సత్యసాయి రథయాత్ర

1020చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని సత్యసాయి దేవాలయంలో బాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి రథయాత్ర వైభవోపేతంగా, కన్నుల పండువగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు పెద్దఎత్తున రథయాత్రలో పాల్గొని సంతోషంగా నృత్యాలు చేస్తూ, ఆడిపాడారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్