కురవి: మూడు కిలోల గంజాయి పట్టివేత

5చూసినవారు
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు, మంగళవారం మధ్యాహ్నం కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ గండ్రాతి సతీష్, జయకుమార్ తమ సిబ్బందితో కలిసి కురవి-ఖమ్మం రోడ్డులో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో, నల్ల రంగు వేసి, నంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని గమనించారు. వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తప్పించుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మూడు కిలోల నిషేధిత గంజాయి లభ్యమైందని సీఐ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్