మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో గ్రహణం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఉదయం నుంచి ఆలయ పూజారులచే శుద్ధి కార్యక్రమాలు పూర్తి కావడంతో, నిత్య పూజలు, అభిషేకాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు.