
ఈ నెల 7న HDFC బ్యాంక్ UPI సేవలకు అంతరాయం
డిజిటల్ చెల్లింపులు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. స్మార్ట్ఫోన్, బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ Google Pay, PhonePe, Paytm, BHIM వంటి డిజిటల్ చెల్లింపు యాప్లను ఉపయోగిస్తున్నారు. నగదు కంటే వీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కాగా HDFC బ్యాంక్ తన సిస్టమ్ అప్డేట్స్ కోసం ఈ నెల 7న అర్ధరాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు UPI సేవలకు అంతరాయం కలుగుతుందని తెలిపింది. కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలని ఒక ప్రకటనలో వెల్లడించింది.




