
ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం.. నర్సుపై కాల్పులు
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా షాగఢ్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం రాత్రి 25 ఏళ్ల స్టాఫ్ నర్సు దీప్శిఖా చదర్ను గుర్తు తెలియని వ్యక్తి గన్తో కాల్చి హత్య చేశాడు. నైట్ డ్యూటీకి సిద్ధమవుతున్న ఆమెపై ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద దాడి చేసి, మూడు రౌండ్లు కాల్పులు జరిపి నిందితుడు పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, జబల్పూర్కు చెందిన ఒక యువకుడిని అనుమానిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి కోసం ఒత్తిడి చేయగా నిరాకరించడంతో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.




