మహబూబాబాద్ జిల్లా మరిపెడ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ తో కలిసి విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని తెలిపారు. ఆశావాహులు తాత్కాలిక, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా మూడో తేదీ వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని సూచించారు. అలా చేస్తేనే భవిష్యత్తులో వారికి పార్టీలో భాగస్వామ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.