మహబూబాబాద్ మండలంలోని ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్ కు మద్య మార్చి 4వ తేదీన సాయంత్రం వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుండి తన కొడుకు వినయ్ ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు ఇల్లు, ఇతర చోట్ల వెదికారు. కానీ ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి ఎస్ఐ సతీష్ తెలిపారు.