మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కేజీబీవీ పాఠశాలను శనివారం సందర్శించిన జెండర్ ఈక్విటీ కో ఆర్డినేట్ ఆఫీసర్ జి. విజయ కుమారి, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఆమె టీచింగ్ డైరీస్, లెసన్ ప్లాన్స్, మార్క్స్ రిజిస్టర్లు, టీచర్స్ అటెండన్స్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులు భోజన వసతి, హాస్టల్ సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.