సౌతాఫ్రికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో హన్మకొండ జిల్లాకు చెందిన ట్రైనీ పైలట్ సుమంత్ ఆదివారం మృతి చెందాడు. హసన్ పర్తి మండలానికి చెందిన సుమంత్, పైలట్ కావాలనే లక్ష్యంతో ఏడాది క్రితం సౌతాఫ్రికా వెళ్ళాడు. కార్గో పైలట్ శిక్షణ పూర్తి చేసుకుని, మరో వారంలో ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా, స్నేహితుడు నడుపుతున్న చార్టర్డ్ ఫ్లైట్‌లో కూర్చున్నాడు.
విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో సుమంత్ స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.