మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం పర్యవేక్షించిన డీఏవో సరిత, రైతులు యూరియా కొనుగోలు కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా 'యూరియా యాప్'ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా ఎటువంటి సమయం వృథా కాకుండా సులభంగా ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ పర్యటనలో ఏఓ వీరా సింగ్, స్థానిక రైతులు పాల్గొన్నారు.