
మరిపెడ: స్పీడ్ కంట్రోల్ కు చర్యలు చేపట్టాలి: డిఎస్పీ
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్, బుధవారం మరిపెడ మండలం బురహనపురం శివారులోని జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని, స్పీడ్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని నేషనల్ హైవే అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై వీరభద్రరావు కూడా ఆయన వెంట ఉన్నారు.






































