
చైనా మాంజా విక్రేతలకు పోలీసులు హెచ్చరిక
డోర్నకల్ పట్టణంలో పోలీసులు పలు షాపుల్లో సోదాలు నిర్వహించి, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ చంద్రమౌళి శనివారం మాట్లాడుతూ ఈ సింథటిక్ మాంజా వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, దీనిని విక్రయించినా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. డోర్నకల్ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.







































