
గ్రామ పంచాయతీ ఎన్నికలు: వినూత్న పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆకట్టుకుంటున్నాయి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వరంగల్ జిల్లాలో, గీసుకొండ, గంగదేవిపల్లి, నల్లబెల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పెళ్లి మండపాలను తలపించేలా, పచ్చదనంతో కూడిన 'గ్రీన్ పోలింగ్ స్టేషన్స్'గా తీర్చిదిద్దారు. కలెక్టర్ సత్యశారద దేవి ఆలోచనతో, ఓటర్లను ఆకట్టుకోవడానికి అరిటాకు తోరణాలు, మామిడాకులు, కొబ్బరిమట్టలు, బంతిపూల దండలతో స్వాగతం పలికారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.














