Mar 09, 2026, 12:03 IST/
ఆ వెబ్సైట్ ఫేక్.. హెచ్చరించిన కేంద్రం
Mar 09, 2026, 12:03 IST
నకిలీ వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండేలా http://sarvashikshaabhiyan.com అనే నకిలీ సైట్‌ను సైబర్ మోసగాళ్లు రూపొందించినట్లు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. ఈ వెబ్‌సైట్‌కు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. నియామకాలు లేదా ఇతర వివరాల కోసం అధికారిక వెబ్సైట్లలోనే సమాచారాన్ని చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించింది.