హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలో జిమ్ నిర్వాహకులు నర్మెట ప్రసాద్ దంపతులు యువతను చెడు వ్యసనాలకు దూరం చేస్తూ, క్రమశిక్షణతో కూడిన శిక్షణ అందిస్తున్నారు. వీరి శిక్షణతో ఎంతోమంది యువతీ యువకులు ఆర్మీ, పోలీస్, రైల్వే, స్పోర్ట్స్, టీచర్స్ వంటి ప్రభుత్వ
ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా యువతను సన్మార్గంలో నడిపిస్తున్న ప్రసాద్ దంపతులను స్థానిక యూత్ సభ్యులు ఆదివారం ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. వీరిని యువతకు రోల్ మోడల్స్‌గా పరిగణిస్తున్నారు.