జనగామ జిల్లా సింగరాజుపల్లి టోల్ సమీపంలో మంగళవారం బొలెరో, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బియ్యం లోడుతో ఉన్న బొలెరో పల్టీ కొట్టింది. కోదాడ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న బొలెరో, జనగామ నుంచి మరిపడిగకి వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. బొలెరోలోని ముగ్గురికి గాయాలవడంతో వారిని జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.