జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఆగపేట గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ డా. పగిడిపాటి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, గ్రామ పంచాయతీ సిబ్బంది సంక్షేమం కోసం ముగ్గురు సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 15 లక్షల చొప్పున ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించారు. గ్రామ పరిశుభ్రత, అభివృద్ధికి సేవలందిస్తున్న సిబ్బందికి అందించిన ఈ బీమా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభినందించారు.