జనగామలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

జనగామ జిల్లాలో జూన్ 5 నుంచి 12 వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 151 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.