జనగామ మాతా శిశు ఆసుపత్రిలో బుధవారం ఒక మహిళ పసికందును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆటోలో తరలిస్తున్న శిశువును కుటుంబ సభ్యులు, స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. ఆగ్రహంతో మహిళకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి డోర్లు, అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.