బచ్చన్నపేట మండల కేంద్రంలోని మల్లు స్వరాజ్యం కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య మాట్లాడుతూ, 'ఆడపిల్లను పుట్టనిద్దాం, పెరగనిద్దాం, ఎదగనిద్దాం' అనే నినాదంతో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆడపిల్లలను గౌరవించే విధంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు పల్లెర్ల లలిత, పందిళ్ళ కళ్యాణి, అనిత, కొమ్ము శిరీష, సుంచు కవిత, కవిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.