జనగామ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం సమీక్ష నిర్వహించారు. సక్సెషన్, మ్యుటేషన్ వంటి భూ సంబంధిత దరఖాస్తులను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరిపాలనలో పారదర్శకత పెంచేందుకు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు.