బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి

2చూసినవారు
బైక్, లారీ ఢీ.. యువకుడు మృతి
రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన రాగి సంజీవ(19) బైక్, లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన బూడిద ప్రసాద్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన నెల్లుట్ల ఫ్లైఓవర్ వద్ద చోటుచేసుకుంది. జనగామకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, బ్రిడ్జి వద్ద నెల్లుట్ల వైపు వెళ్లేందుకు లారీ యు టర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రసాద్ ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

సంబంధిత పోస్ట్