
ట్రంప్ టారిఫ్ అధికారాలకు సెనేట్ బ్రేక్.. వాణిజ్య యుద్ధం ముగిసినట్టేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అంతర్జాతీయ దిగుమతి సుంకాలపై (టారిఫ్‌లు) సెనేట్ గట్టిగా వ్యతిరేకించింది. 51-47 ఓట్లతో టారిఫ్‌లను ఓడించడంతో, ట్రంప్ దూకుడుకు బ్రేక్ పడింది. ఈ నిర్ణయం వాణిజ్య యుద్ధాలు ముగిసే అవకాశాలను సూచిస్తోంది. బ్రెజిల్, కెనడా టారిఫ్‌లపై కూడా ఇలాంటి ఓట్లు జరిగాయి. టారిఫ్‌లు రద్దు కావడంతో దిగుమతులు సులభతరమై, ఉత్పత్తి ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ బిల్లు ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో చర్చకు రానుంది.




