జనగాం జిల్లా రఘునాథపల్లి మండలంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండల మాజీ జెడ్పీటీసీ మరియు బీఆర్ఎస్ నాయకుడు బొల్లం అజయ్ (మణికంఠ) మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.