జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీ నుంచి 'సదరం' శిబిరాలు ప్రారంభం కానున్నాయని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిణి (డీఆర్డీఓ) వసంత తెలిపారు. మీ సేవ కేంద్రాల్లో ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే ఈ శిబిరాలకు హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటిస్తామని ఆమె చెప్పారు.