జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.