జనగామ పట్టణంలో వనిత టీ స్టాళ్లను ప్రారంభించిన కలెక్టర్

1చూసినవారు
జనగామ పట్టణంలో వనిత టీ స్టాళ్లను ప్రారంభించిన కలెక్టర్
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక ఎదుగుదలకు, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా, పట్టణంలోని మున్సిపల్, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆవరణలో (మెప్మా) సౌజన్యంతో ఏర్పాటు చేసిన వనిత టీ స్టాళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్