
సె*క్స్ వర్కర్లను నేరస్తుల్లా చూడొద్దు: సుప్రీంకోర్టు
స్వచ్ఛందంగా సె*క్స్ వర్క్ చేసుకునే వారిని నేరస్తుల్లా చూడకూడదని, వారిపై పోలీసులు దాడులు చేయడం, కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, అది సె*క్స్ వర్కర్లకు కూడా వర్తిస్తుందని కోర్టు గుర్తు చేసింది. మానవ అక్రమ రవాణా ముఠాలపై ఉక్కుపాదం మోపాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది.




