పల్స్ పోలియోకు కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపు

2148చూసినవారు
పల్స్ పోలియోకు కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపు
ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌లో ఈనెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ పిలుపునిచ్చారు. జిల్లాలో 0 నుంచి 5 ఏళ్ల వయస్సు గల 76,660 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 469 పోలియో బూత్లు, మొబైల్, ట్రాన్సిట్, పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలన్నారు.

సంబంధిత పోస్ట్