జనగామ జిల్లా బచ్చన్నపేట మండల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్ రావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, రోగులకు సరైన మందులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి రోగుల పట్ల మెరుగైన సేవలు అందించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సృజన, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డాక్టర్ సిద్ధి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఉమా, డాక్టర్ కాంతి, స్వరూప పాల్గొన్నారు.