బొకేలు వద్దు విద్యార్థులకు తోడ్పాటునివ్వండి: కలెక్టర్

6చూసినవారు
బొకేలు వద్దు విద్యార్థులకు తోడ్పాటునివ్వండి: కలెక్టర్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం విజ్ఞప్తి చేశారు. వాటిపై చేసే ఖర్చును పేద విద్యార్థుల చదువుకు ఉపయోగపడేలా మలచాలని సూచించారు. బొకేలకు బదులుగా నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు లేదా పేదలకు ఉపయోగపడే దుప్పట్లు అందజేయాలని కోరారు. వీటిని అవసరమున్న విద్యార్థులకు, నిరుపేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్