జనగామలో ఎరువుల దుకాణాల బంద్

3చూసినవారు
జనగామలో ఫర్టిలైజర్, సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం దుకాణాల బంద్ నిర్వహించారు. ఆల్ ఇండియా, స్టేట్ అసోసియేషన్ల పిలుపు మేరకు వ్యాపారులు స్వచ్ఛందంగా విక్రయాలను నిలిపివేశారు. ఎరువుల కంపెనీలు యూరియాను నేరుగా దుకాణాల వద్దకే సరఫరా చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కంపెనీల విధానాల వల్ల యూరియా బస్తాపై రూ. 40 నుంచి రూ. 50 వరకు అదనపు భారం పడుతోందని వారు తెలిపారు.